స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -170లో.. మురారి రాసుకున్న డైరీ చూసి చదువుతుంది కృష్ణ. అప్పుడే మురారి రాగా.. కృష్ణ కంగారుగా డైరీని బెడ్ కింద దాచేస్తుంది. ఇక కృష్ణ, మురారి భోజనం చేయడానికి కిందకి వెళ్తారు. కానీ కృష్ణ ఆలోచన మొత్తం ఆ డైరీ మీదే ఉంటుంది. ఆ తర్వాత కృష్ణ, మురారిలు రేవతి దగ్గరికి వస్తారు. న్యాప్కిన్స్ మురారి బట్టలతో పాటు వెళ్లాయేమో.. కృష్ణ నువ్వు వెళ్లి తీసుకురా అని రేవతి అంటుంది. కృష్ణ వెళ్ళి ఆ డైరీ ఎక్కడ చూస్తుందో అని కంగారు పడతాడు మురారి. ఆ తర్వాత కృష్ణ ఎందుకు నేను వెళ్తానని మురారి అంటాడు. మురారి కంగారు పడడం కృష్ణ గమనిస్తుంది. నీ భార్యకి నేను పని చెప్పకుడదా? నువ్వు వెళ్లి తీసుకురా కృష్ణ అని రేవతి అంటుంది.
కృష్ణ పైకి వెళ్ళి బెడ్ కింద నుండి ఆ డైరీ తీసి చదువుతుంది. అది చదివి మురారి లైఫ్ లో ఇంకొక అమ్మాయి ఉందని కృష్ణ తెలుసుకొని తట్టుకోలేదు. కృష్ణ ఏడుస్తూ.. నా జీవితంలో ఇన్ని రోజులుగా ప్రేమకి చోటు లేదు.. మొదటిసారిగా ఏసీపి సర్ ప్రేమలో పడిపోయా కానీ ఏసీపి సర్ జీవితంలో వేరే అమ్మాయి ఉందని అనుకుంటూ ఏడుస్తుంది. మురారి తన ప్రేమికురాలి గురించి నువ్వు తప్ప నా లైఫ్ లో ఏ ప్రపంచసుందరి వచ్చినా, నా జీవితంలో నీకు తప్ప ఎవరికీ స్థానం లేదని మురారి డైరీలో ఉంటుంది. అది చూసిన కృష్ణ ఎమోషనల్ అవుతుంది. ఇంకా కృష్ణ కిందకి రావడం లేదేంటి డైరీ ఏమైనా చూసిందా అని అనుకుంటాడు మురారి. కృష్ణ అప్పుడే డైరీ అక్కడ పెట్టేసి కిందకి వస్తుంది. కృష్ణ డల్ గా ఉండడం చూసిన మురారి.. కృష్ణ డైరీ చదివిందా అని అనుకుంటాడు.
కృష్ణ కిందకి రాగానే మురారి హడావిడిగా పైకి వెళ్తాడు. డైరీ ఓపెన్ చేసి ఉండటం చూస్తాడు మురారి. కృష్ణ పరిచయం అయిన దగ్గర నుండి డైరీలో రాసుకున్నది మురారి చదువుతాడు.. కృష్ణ మాత్రం ముకుందతో లవ్ లో ఉన్నప్పటి జ్ఞాపకాలు చదువుతుంది. ఆ డైరీ లోనే ఉన్న కృష్ణ గురించి రాసిన ప్రేమని కృష్ణ చదవదు. ఏసీపి సర్ లైఫ్ లో ఇంకొకరు ఉన్నారని బాధపడుతుంది కృష్ణ. మురారి మనసులో ప్రస్తుతం కృష్ణకు మాత్రమే స్థానం ఉందని తెలుస్తుందా? ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.